కామారెడ్డి, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీఆర్‌ఎస్ పార్టీకి కామారెడ్డిలో భారీ షాక్ తగిలింది. కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియా రాజీనామ చేశారు. రాజీనామా లేఖను కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంకే ముజీబొద్దీన్‌కు అందజేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి 16వ వార్డు కౌన్సిలర్ చాట్ల వంశీ కూడా రాజీనామా చేశారు.
బీఆర్‌ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు కనపర్తి అరవింద్, బిసి సెల్ సెక్రటరీ బల్ల శ్రీనివాస్, యూత్ వైస్ బండారి శ్రీకాంత్‌లు సైతం పార్టీకి రాజీనామా చేశారు. అలాగే యూత్ కమిటీ పదవులకు ఇమ్రాన్, వేణు, చేవెళ్ల రాజులు రాజీనామా చేశారు. సూర్య బాయ్ యూత్, టీఆర్‌ఎస్ సభ్యత్వానికి, గడ్డం సురేందర్ రెడ్డి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్, బీఆర్‌ఎస్ నేతల ఆధిపత్య ధోరణి, కార్యకర్తలను పట్టించుకోకపోవడం, నాయకులకు సముచిత స్థానం గౌరవం దక్కక పోవడంతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఏదైమైనా కెసిఆర్ కామారెడ్డి నుంచి పోటీచేస్తున్న తరుణంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు రాజీనామాలు చేస్తుండడం పట్ల బిఆర్‌ఎస్ నేతల్లో గుబులు మొదలైంది.