నిజామాబాద్, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రస్తుత ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదని, అలాంటి వార్తలను ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయడం, ప్రింట్ మీడియాలో ప్రచురించడం గానీ చేయరాదన్నారు. 7 నవంబర్ 2023 ఉదయం 6:30 గంటల నుండి 30 నవంబర్ 2023 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.