నిజామాబాద్, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్రీయ ఏక్తా దివస్ను పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు కలెక్టరేట్ అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు.
దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి అంకితభావంతో కృషి చేస్తానని, తోటి వారందరిలో ఈ భావనను పెంపొందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని, సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికతతో దేశానికి సమకూరిన అంతర్గత భద్రతను పటిష్టపరిచేందుకు తోడ్పాటును అందిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారిణి ఎన్.పద్మశ్రీ, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.