ఆర్మూర్, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో ప్రతీ మంగళవారం మాదిరిగానే ఈ మంగళ వారం కూడా హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణము చేశారు.
భక్త హనుమాన్ ఆలయ ప్రాంగణంలో భక్తులు నిలబడి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. అనంతరం మంగళ హారతి ఇచ్చారు, జై శ్రీరామ్, జై భక్త హనుమాన్ అని నినాదాలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ కుమార్, జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్, కోశాధికారి ఎర్ర భూమయ్య, సంఘము నర్సయ్య, కుమార్, ఎల్.సాయన్న, నారాయణ, సిహెచ్.నరహరి, ఇట్టెం సాయన్న, జయరాం, పోశెట్టి, నల్ల సాయన్న, గోపి, భాజన్న తదితరులు పాల్గొన్నారు. గత 22 వారాలుగా ప్రతి మంగళవారం ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణము నిర్వహిస్తున్నారు.