కామారెడ్డి, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజల చందాలతో గెలిచి వారికి అందుబాటులో లేకుండా పత్తా లేకుండా పోయిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ను తరిమి కొట్టాలని గ్రామాలలో నిలదీయాలని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కలకుంట్ల మదన్ మోహన్ రావు కార్యకర్తలకు చెప్పారు. మండల కేంద్రంలో గడపగడప కాంగ్రెస్ ప్రచారం చేపట్టి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ప్రజలు చందాలు వేసుకుని గెలిపిస్తే వారిని కలవకుండా వారికి సేవలు చేయకుండా అందుబాటు లేకుండా నాలుగున్నర ఏళ్లు నిద్రపోయిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ చేతకాని దద్దమ్మ అని మదన్మోహన్ విమర్శించారు. తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్‌లో చదివానని ఈ మట్టి వాసన మనిషిని నాలుగున్నర ఏళ్లు కాలుకి బలపం కట్టుకుని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తిరిగి అన్ని వర్గాల ప్రజలకు సేవలు చేసానని ప్రతి గ్రామం తిరిగి ప్రజలకు అందుబాటులో ఉన్నానన్నారు.
కరోనా ఆపద సమయంలో అన్ని గ్రామాలు తిరిగి వైద్య సేవలు అందించి వందల మంది ప్రాణాలు కాపాడానని మదన్మోహన్ గుర్తు చేశారు. ఇంటింటికి బిందెలు పంపిణీ చేశానని కళ్లద్దాలు అందించాలని వైద్య శిబిరాలు నిర్వహించానని చెప్పారు. జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగాలు ఇప్పించానని గుర్తు చేశారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మరిన్ని ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు.
గత 30 ఏళ్లుగా బస్టాండు, పోస్ట్ ఆఫీస్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రోడ్లు, మురికి కాలువలు నిర్మించలేదన్నారు. 30 శాతం కమిషన్ ఎమ్మెల్యే సురేందర్ అని విమర్శించారు. కుల సంఘాలకు భవనాలు నిర్మిస్తానని హమీ ఇచ్చారు. ఆరు కాంగ్రెస్ గ్యారంటీ హామీలను ఇంటింటికి ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు.
కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడే వారందరికీ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అన్నదాతకు రెండు లక్షల రుణమాఫీ పథకం కాంగ్రెస్ గెలిచాక వెంటనే చేపడుతుందన్నారు.
శబరి మాత తల్లి పై ప్రమాణం చేస్తున్న ఒక్క రూపాయి ప్రజల నుండి ఆశించను ప్రభుత్వ నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని మదన్ మోహన్ హామీ ఇచ్చారు. సమయం లేదు 30 రోజులు కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ గాలి వీస్తుందని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ పేర్కొన్నారు.
సంతాయి పేటకు చెందిన లబ్ధిదారునికి కాంగ్రెస్ కార్యకర్త అని బీసీ బందు మంజూరైన రద్దు చేశారని కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు ప్రజలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.