బీర్కూర్, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 39 వ వర్ధంతిని మంగళవారం బీర్కూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయిని శంకర్ మాట్లాడుతూ పేదరికం పారద్రోలెందుకు ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారన్నారు. బ్యాంకులను జాతీయ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడు, గూడు, ఉండాలన్న సంకల్పంతో నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు, పంట భూములను పంపిణీ చేశారన్నారు. నేడు దళితులు ఆత్మ గౌరవంతో బతుకుతున్నారంటే దానికి కారణం ఇందిరా గాంధీనే అన్నారు.
ఆమె మరణించిన పేద ప్రజల గుండెల్లో చిరకాలం గుర్తుండిపోతారని అన్నారు. ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కార్యక్రమంలో నాయకులు సానేపు గంగారం, యమ రాములు, రాజప్ప పటేల్, అవగిరిరావు దేశాయ్, బెల్ కొని గంగారం, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొంతురం కాశిరాం, నన్నపనేని రామారావు, రఫీ, పుల్లని పీరయ్యా, లాలయ్య, బోయిని గంగాధర్, మహారాజ్ గంగారాం, అయినాల సాయిలు, నరసింగరావు, లక్ష్మీనారాయణ, బశెట్టి, పుల్లేరి గంగాధర్, కురుమ సంగమేష్, తదితరులు పాల్గొన్నారు.