నిజామాబాద్, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామానికి విస్తరించడంలో కీలక పాత్ర పోషించిన యువ నాయకుడు, గోరక్షణ, దేవాలయాల పరిరక్షణ కోసం ముందుండి పోరాడేవాడిగా వందలాదిమంది యువకుల్లో హిందుత్వ నిష్ఠను రగిలింపజేసిన పటేల్ ప్రసాద్ యువతలో బీజేపీ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ పార్టీ విస్తరణలో జిల్లాలో కీలకమైన పాత్ర పోషించిన కృషిని అభినందిస్తూ, మరింత ఉత్సాహంగా పార్టీకోసం పని చెయ్యాలని ఆశిస్తూ పార్టీ యువజన విభాగం యొక్క రాష్ట్ర కార్యదర్శిగా మళ్ళీ నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ గతం కంటే రెట్టింపు ఉత్సాహంతో పార్టీ విస్తరణకు పని చేస్తానని పార్టీకి తన సేవలను గుర్తించి మరోసారి రాష్ట్ర స్థాయి బాధ్యతను అప్పజెప్పిన అధ్యక్షుడు భానుప్రకాశ్కి, కిషన్ రెడ్డికి, బండి సంజయ్‌కి, తరుణ్ చుగ్కి, సునీల్ బన్సాల్‌కి, యెండల లక్ష్మీనారాయణ కి ధన్యవాదాలు తెలిపారు.