ఓటు హక్కు దేశ సంక్షేమానికి అభివృద్ధికి పునాది లాంటిది

నిజామాబాద్‌, నవంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తెరగాలని అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి తెలిపారు. బుధవారం నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌, డిగ్రీ కాలేజ్‌ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి మాట్లాడుతూ…. 18 సంవత్సరాల నిండిన యువతి, యువకులకు ఓటు హక్కు దేశ సంక్షేమానికి అభివృద్ధికి పునాది లాంటిదని, దానిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. దేశం, రాష్ట్రం, జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ప్రజలకు సుపరిపాలన అందించే ఒక మంచి లక్షణాలు కలిగిన అభ్యర్థిని ఎన్నికల సమయంలో ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవాలన్నారు. సమాజంలోని విద్యావంతులు, ప్రజలు ఓటు విలువ తెలుసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో నిజాయితీగా ఓటు వేయాలని సూచించారు. యువత ఓటు వినియోగించడంలో నిజాయితీని ప్రదర్శించాలని సూచించారు.

నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మంద మకరందు, ఐఏఎస్‌ మాట్లాడుతూ…. వయోజనులైన ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగి మంచి నాయకులను ఎన్నుకోవాలని తెలిపారు. మీ గ్రామాల్లో ఓటు హక్కుపై ప్రజలను చైతన్య వంతులను చేసి ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు.

ఓటు వజ్రాయుధం లాంటిదని, యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సీబీసీ ఎఫ్‌ పిఓ బి.ధర్మ నాయక్‌ సూచించారు. ఒక్క ఓటు చరిత్ర గతిని మారుస్తోంది. మన భవితను తిరగరాస్తోంది. మంచి సమాజ నిర్మాణానికి దోహదం చేస్తోందన్నారు.

బహుమతులు ప్రదానం

ఓటుహక్కుపై నిర్వహించిన ఉపన్యాస, వ్యాసరచన, రంగోలి పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథిలు చేతులు మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. అంతకు ముందు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో కళాకారుల బృందం తమ పాటలతో ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అలాగే ఓటు హక్కు ప్రాధాన్యతపై నిజామాబాద్‌ సీబీసీ ఫీల్డ్‌ ఆఫీస్‌ ఎఫ్‌ పిఓ బి.ధర్మ నాయక్‌, గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామ్‌ మోహన్‌ రెడ్డి, స్వీప్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ సురేష్‌, డిసిఓ సింహాచలం పలువురు ముఖ్య అధితులు ప్రసంగించారు.

కార్యక్రమంలో డిపిఆర్‌ ఓ పద్మశ్రీ, ఎన్‌ ఎస్‌ ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ సునీతా, ఎన్‌ ఎస్‌ ఎస్‌ ప్రోగ్రాం అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »