కామారెడ్డి, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎగ్జిట్ పోల్స్ ప్రసారాలు, ప్రచురణలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశమున్నందున ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951 లోని సెక్షన్ 126 -ఎ ప్రకారం ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదని, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురణలు, ప్రసారాలు చేయరాదని ఆయన తెలిపారు.
ఈ నెల 7 న ఉదయం 7 గంటల నుండి ఈ నెల 30 న సాయంత్రం 6. 30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై ప్రసారాలు, ప్రచురణలపై నిషేధం అమలులో ఉంటుందని అయన వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండు ఉంటాయని ఎన్నికల సంఘం పేర్కొందని కలెక్టర్ తెలిపారు.