మూలకాల పెట్టె పుస్తకావిష్కరణ

వేల్పూర్‌, నవంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాదు ఫిజికల్‌ సైన్స్‌ ఫోరమ్‌ అధ్వర్యంలో గురువారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల అంక్సాపూర్‌, మండలం వేల్పూరులో జరిగిన కార్యక్రమంలో తంగుడిగే శ్రీనివాస్‌ రావు రచించిన మూలకాల పెట్టె అను పుస్తకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రమును తెలుగు భాషకు అనుసంధానం చేస్తూ ఆటవెలది పద్యరూపంలో విద్యార్థులకు విన్నూత రీతిలో విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాల పట్ల అమితాసక్తీ, క్యూరియాసిటి, అభివృద్ధిని పెంపొందించడానికి ప్రయోగాత్మకంగా ఈ రెండవ సైన్స్‌ పుస్తకం రాయడం జరిగిందన్నారు.

గత ఏడాది సైన్స్‌ బాల వినోదిని రచించారు. మూలకాల పెట్టె పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఆర్‌టియు రాష్ట్ర బాధ్యులు కమలాకర్‌ రావు జిల్లా అద్యమోహన్‌ రెడ్డి చేతుల మీద ఆవిష్కరించారు.

కార్యక్రమంలో భాగంగా పిఆర్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్‌ రావు మాట్లాడుతూ సైన్స్‌ ఉపాధ్యాయులుగా ఉంఢ తెలుగు భాషలో తమ పటుత్వంతో పద్యాలు రాయడం గొప్పతనం అని కొనియాడారు. ఇందులో భాగంగా మోహన్‌ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మల్లేశ్వరీ, రాజేశ్వరీ, లింగన్న, రాం మోహన్‌, మండల అధ్యక్షులు గంట అశోక్‌, శివకుమార్‌, రఘునాథ్‌, పోశన్న, రవీందర్‌, శ్రీనివాస్‌, అనంత జనార్ధన్‌, కరుణాకర్‌, కాంతయ్య, రాజేంద్ర, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »