బాన్సువాడ, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారతీయ జనతా పార్టీ అధిష్టానం గురువారం అభ్యర్థుల మూడవ జాబితా ప్రకటించింది. ఇందులో 35 మందికి చోటు కల్పించారు. అందరి దృష్టి ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడపై ఉంది. బాన్సువాడలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి బలమైన నాయకుడిగా ముద్ర పడ్డారు. ఈ బలమైన నాయకుడిని ఢీ కొనడానికి ఎవరు వస్తారని? భాజపా, కాంగ్రెస్ పార్టీలో నుంచి అందరూ ఎదురుచూశారు. గురువారం ప్రకటించిన మూడవ జాబితాలో నిజామాబాద్ పట్టణానికి చెందిన రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, బాన్సువాడ భాజపా అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది.
గతంలో కూడా 2004లో పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఢీకొట్టడానికి ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ బాన్సువాడకు వలస వచ్చారు. ఆయన ప్రచారం తీరులో మార్పు చేసి బలమైన నాయకుడైన పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఓడిరచారు. తిరిగి 2023లో మళ్లీ వలసవాది బాన్సువాడకు భాజపా అభ్యర్థిగా వస్తున్నారు.
ఎండల లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానం
ఎండల లక్ష్మీనారాయణ స్వస్థలం నిజామాబాద్, 1 మార్చి 1963 లో జన్మించారు,. ఆయన తండ్రి నడిపి చిన్నయ్య కౌన్సిలర్‌గా పని చేశారు. ఎండల లక్ష్మీనారాయణ కుటుంబం రాజకీయ కుటుంబం, భార్య సరస్వతి, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆయన విద్యాభ్యాసం పూర్తిగా నిజామాబాద్‌లోనే జరిగింది. గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.
1980లో అఖిల భారత విద్యార్థి పరిషత్ లో క్రియాశాలిక గా పనిచేశారు. అప్పట్లో విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసి విద్యార్థులకు అండగా నిలిచారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎండల లక్ష్మీనారాయణ తీవ్రంగా కృషి చేశారు. 1970, 1972 లో జనతా పార్టీ గా ఉన్న పార్టీ 1983లో భారతీయ జనతా పార్టీగా మారిపోయింది.
అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర నాయకుడిగా యెండల లక్ష్మీనారాయణ పనిచేస్తూ 1984లో భారతీయ జనతా పార్టీలోకి చేరి సామాన్య కార్యకర్తగా పనిచేశారు. నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడిగా, నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా,. రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులుగా పదవులు చేపట్టి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేశారు. అంచలంచలుగా ఎదిగి ఎమ్మెల్యే స్థాయికి ఎండల లక్ష్మీనారాయణ వచ్చారు.
1999లో నిజామాబాద్ భాజపా అభ్యర్థిగా ఎండల లక్ష్మీనారాయణకు అవకాశం వచ్చింది. పిసిసి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ పై పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. లక్ష్మీనారాయణ ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర పిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ దిగ్గజం డి. శ్రీనివాస్‌పై పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్న ఎండల లక్ష్మీనారాయణ ఘనవిజయం సాధించారు.
తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా పిసిసి రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీనివాస్ పై పోటీ చేసి తన సత్తాను చాటుకున్నారు. రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్న డి. శ్రీనివాస్ ఓడిరచి నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ భారతీయ జనతా పార్టీని పట్టుకొని ఉంటూ అందరి నోట్లో , భాయ్ సాబ్ అని పేరు తెచ్చుకున్నారు.
ఎండల లక్ష్మీనారాయణ వద్దకు వెళ్తే పని కాదనే సమస్యే ఉండదు అనే విధంగా ఆయన పనితీరు భారతీయ జనతా పార్టీకి ఎంతో బలం చేకూర్చింది. నిజామాబాద్ గ్రామీణ నుంచి పోటీ చేయాలనుకున్న యెండల లక్ష్మీనారాయణకు, బాన్స్వాడలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో అధిష్టానం ఆలోచించి ఎండల లక్ష్మీనారాయణ బాన్సువాడకు భాజపా అభ్యర్థిగా ప్రకటించారు.