నిజామాబాద్, నవంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎన్నికల్లో ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉండే పోలింగ్ విధులను ప్రిసైడిరగ్ అధికారులు (పీ.ఓలు), సహాయ ప్రిసైడిరగ్ అధికారులు (ఏ.పీ.ఓ.లు) సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. పోలింగ్ రోజున కలెక్టర్ తో పోలిస్తే పీ.ఓ లు నిర్వర్తించాల్సిన బాధ్యత ఎంతో ఎక్కువ అయినందున క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు.
పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశంపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రిసైడిరగ్ అధికారులకు శనివారం మలివిడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిబంధనలు పక్కాగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని, ఏ చిన్న తప్పిదానికి ఆస్కారం కల్పించకూడదని సూచించారు. పోలింగ్ సందర్భంగా పొరపాట్లకు తావిస్తే, కౌంటింగ్ ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు.
ముఖ్యంగా మాక్ పోల్ జరిపిన తరువాత తప్పనిసరిగా డాటాను డిలీట్ చేయాలని, ఈ విషయాన్ని ప్రతి ప్రిసైడిరగ్, సహాయ ప్రిసైడిరగ్ అధికారి గుర్తుంచుకోవాలని అన్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందు కంట్రోల్ యూనిట్ డేటా జీరో ఉందా లేదా అన్నది తప్పక పరిశీలించుకోవాలని తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఓటింగ్ యంత్రాలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, మాక్ పోల్ సమయంలో సాంకేతిక ఇబ్బంది ఏర్పడినప్పుడు సంబంధిత బీ.యూ, సి.యూ, లేదా వివి.ప్యాట్ యంత్రాన్ని మాత్రమే మార్చాలని, పోలింగ్ సమయంలో మాత్రం కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్లలో ఏ ఒక్క దానిలోనూ సమస్య తలెత్తినా సి.యు, బీ.యు లు రెండిరటిని మార్చాలని సూచించారు.
పోలింగ్ విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది ఈ నెల 29 న ఉదయం 7.00 గంటల వరకు తమతమ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. చెక్ లిస్టుకు అనుగుణంగా పోలింగ్ సామాగ్రి ఉందా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, మాస్టర్ ట్రైనర్లు, ప్రిసైడిరగ్ అధికారులు పాల్గొన్నారు.