దోమకొండ, నవంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఓటు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుందని స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా శనివారం దోమకొండలో బీడీ కార్మికులకు ఓటు వినియోగంపై అవగాహన కలిగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు అనేది మనకు కల్పించిన హక్కని, ఎటువంటి ప్రలోభాలకు లొంగక స్వేచ్ఛగా తమ ఓటు వినియోగించుకోవాలని సూచించారు. మీతో పాటు కుటుంభం సభ్యులు, గ్రామస్తులకు ఓటు ప్రాముఖ్యతను వివరించి తప్పక ఓటు వినియోగించుకునేలా చూడాలన్నారు.
కార్యక్రమంలో కార్మిక శాఖ సహాయ కమీషనర్ సురేందర్ కుమార్, దేశాయ్ బ్రదర్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సీనియర్ డివిజనల్ మేనేజర్ ఉమేష్ బాయి పటేల్, గిరీష్ పటేల్, బీడీ కార్మికులు పాల్గొన్నారు.