నిజామాబాద్, నవంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఏఐటీయూసీ జిల్లా కుకింగ్ గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్‌లో భారత్ గ్యాస్ కార్మికులు చేరారు. ఈ సందర్భంగా వారికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య కండువా వేసి సాదరంగా ఏఐటీయూసీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాస్ ఏజెన్సీస్‌లో పనిచేసే డెలివరీ బాయ్స్ హమాలీలు ఇతర కార్మికులు శ్రమ దోపిడి గురవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు నిర్ణయించిన డెలివరీ చార్జీలను ఏజెన్సీల యాజమాన్యాలు ఇవ్వకుండా ప్రజల దగ్గర వసూలు చేసుకోమని కార్మికులను అడుక్కునే వారిలాగా తయారు చేశారని అన్నారు.
కార్మికుడు గ్యాస్ సిలిండర్‌ను గోదాం నుండి కస్టమర్ ఇంటికి డెలివరీ చేస్తే 73 రూపాయలు చెల్లించాల్సి ఉన్న ఏ యజమాని కూడా చెల్లించకుండా కార్మికుల శ్రమ దోపిడీ కాకుండా ఆర్థిక దోపిడీ చేస్తున్నారని అన్నారు.
కార్మికులకు పిఎఫ్ ఈఎస్‌ఐ గ్రాడ్యుటి ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించడం లేదన్నారు. గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయిల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిన్నెల హనుమాన్లు, యూనియన్ అధ్యక్షులు సాయన్న, కార్యదర్శి లక్ష్మణ్, నాయకులు బాల్ లింగం, రవీందర్, మనోజ్, గౌస్, తిరుపతి, రాజు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.