కామారెడ్డి, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం జిల్లాలోని మూడు నియోజక వర్గాలలో 14 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో 11 మంది అభ్యర్థులు 12 నామినేషన్లు దాఖలు చేయగా జుక్కల్ నియోజక వర్గంలో బిజెపి నుండి అరుణ తార, ఎల్లారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థిగా మైతారి సంజీవులు నామినేషన్ దాఖలు చేశారని కలెక్టర్ తెలిపారు.

కామారెడ్డి నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా మడిశెట్టి తిరుపతి రెండు సెట్ల నామినేషన్ వేశారన్నారు. బిజెపి నుండి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, బీఎస్పీ నుండి ఊడ్తవార్ సురేష్ గౌడ్, ధర్మ సమాజ్ పార్టీ నుండి ఉగ్రవాయ్ బోలేశ్వర్, అల్ ఇండియా మజిల్స్-ఇంక్విలాబ్-ఇ -మిల్లత్ నుండి షేక్ అబ్దుల్ వాహెద్, స్వతంత్ర అభ్యర్థులుగా మహేందర్ రెడీ పంజెర్ల, గారెదె వెంకట రావు, కలరామ్ అశోక్ వర్ధన్, భార్గవి మంగిలిపల్లి, బరిగేలా శివ, కంతె సాయన్నలు ఒక్కో సెట్ చొప్పున నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని కలెక్టర్ తెలిపారు.