డిచ్పల్లి, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వైస్‌ఛాన్స్‌లర్ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య.యం యాదగిరి వర్సిటీలో యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.
రిజిస్ట్రార్ చాంబర్లో ఆచార్య ఎం యాదగిరి యాంటీ ర్యాగింగ్ పోస్టర్‌ను విడుదల చేస్తూ విద్యార్థులు శారీరిక, మానసిక, లైంగిక, ఒత్తిడికి గురి చేస్తే చట్టరీత్యా నేరస్తులు అవుతారని పేర్కొన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి సమాజానికి ఉపయోగపడేలా గాని వినాశానికి ఉపయోగపడటం క్షమించరానిదని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విజ్ఞాన అభివృద్ధికి ముందడుగులు వెయ్యాలని పేర్కొన్నారు. అందుకే విద్యార్థులు భవిష్యత్తు కొరకు యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఈ కమిటీకి తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సర్ వకాటి కరుణ చైర్మన్‌గా వ్యవహరిస్తారన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి వైస్ చైర్మన్‌గా, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ ఆరతి కన్వీనర్‌గా మరియు డాక్టర్ కే రవీందర్ రెడ్డి, డాక్టర్ ఎం. బీ. బ్రమరాంబిక, డాక్టర్ జి బాలకిషన్, డాక్టర్ ఏ. పున్నయ్య, డాక్టర్ గుల్ ఈ రానా, డాక్టర్ మహేందర్ ఐలేని, డాక్టర్ కే కిరణ్మయి, డాక్టర్ కిరణ్ రాథోడ్ మెంబర్స్‌గా నియమించారు.
విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురైన కమిటీ మెంబర్లకు సమాచారం అందించాలని రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి పేర్కొన్నారు.