బాన్సువాడ, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌లో సోమవారం ఆర్టీసీబస్సు క్రింద పడి పాత బాన్సువాడ సంగమేశ్వర కాలనీకి చెందిన రాజబోయిన రుక్కవ్వ (80) ప్రమాదవశాత్తు పడి మృతి చెందిందని స్థానికులు తెలిపారు.
మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు మృతురాలి బంధువులు తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.