కామారెడ్డి, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపెట్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన 28 మంది యువకులు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి దగ్గరగా అన్ని సౌకర్యాలు కలిగిన కామారెడ్డిపై దొరల కన్ను పడిరదని, ఎన్నికల వేళ అభివృద్ధి పేరిట దోచుకునేందుకు దొరలు వస్తున్నారని, వాళ్ళు వస్తె అభివృద్ధి కాదు సరి కదా ప్రజల వద్ద ఉన్నది దొచుకుంటారనీ అన్నారు.
ప్రజలు తమ భూములు దరణిలో పదిలంగా ఉన్నయో లేదో అని మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారనీ, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, కామారెడ్డిలో దొరల ఆటలు సాగవని పేర్కొన్నారు.