కామారెడ్డి, నవంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామానికి చెందిన మల్లవ్వ (70) ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తనిల్వలు రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని పట్టణానికి చెందిన అల్వాల కృష్ణ ప్రసాద్ మానవత దృక్పథంతో స్పందించి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారని ఐవీఎఫ్ సేవా రాష్ట్ర చైర్మన్, జిల్లా రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటాలన్నారు. రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్,ఐవిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. రక్తదానం చేయాలనుకున్నవారు వారి యొక్క వివరాలకు 9492874006 నెంబర్ కు తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో కెబిసి రక్తనిధి టెక్నీషియన్ సంపత్, జీవన్, వెంకట్ పాల్గొన్నారు.