లాభాన్‌ లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చుతాం

గాంధారి, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని లాబానా లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చి వారి కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరిష్‌ రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రంలో గల లాబానా నాయకులతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలో తమను రిజర్వేషన్‌ ఎస్టీ జాబితాలో చేర్చి రిజర్వేషన్‌ కల్పించకపోతే కామారెడ్డిలో కెసిఆర్‌పై వెయ్యి నామినేషన్లు వేస్తామని లాబానా నాయకులు హెచ్చరించారు. ఈ సందర్బంగా కామారెడ్డి జిల్లా గాంధారి మాజీ జడ్పీటీసీ, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు తానాజీ రావు లాబానా నాయకులతో చర్చలు జరిపారు. వారిని ఒప్పించి మంత్రి హరీష్‌ రావుతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా మంత్రి హరిష్‌ రావు, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ హైదరాబాద్‌ లో లాబానా నాయకులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిఓ నెంబర్‌ 245 ను తెలంగాణ రాష్టంలో అమలు చేయాలనీ, లాబానా సమాజాన్ని ఎస్టీ జాబితాలో చేర్చి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి పోడు భూమాలకు పట్టాలు ఇవ్వాలని లాబానా నాయకులు హరీష్‌ రావు ద్రుష్టికి తీసుకోనివచ్చారు.

సానుకూలంగా స్పందించిన హరీష్‌ రావు ముఖ్యమంత్రి కెసిఆర్‌ తో మాట్లాడి రాబోయే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో జిఓ 245 అమలుచేస్తామని, ఎస్టీ జబితా చేర్చే విధంగా తీర్మానం చేసి, ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని హరిష్‌ రావు హామీ ఇచ్చారు. రాబోయే ప్రభుత్వంలో లాబానా సోదరులకు పోడు భూమి పట్టాలు ఇస్తామని అన్నార. దింతో రాబోయే ఎన్నికల్లలో కామారెడ్డిలో కెసిఆర్‌ పై పోటీ చేయబోమని అల్‌ ఇండియా లాబానా సంఘం నాయకుడు తాన్‌ సింగ్‌ తెలిపారు. లాబానా నాయకులతో మాట్లాడి, ఒప్పించిన గాంధారి మాజీ జడ్పీటీసీ తానాజీ రావును హరిష్‌ రావు, ఎంపీ బీబీ పాటిల్‌ అభినందించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »