కామారెడ్డి, నవంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలంలోని గణిత ఉపాధ్యాయులందరికీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవునిపల్లిలో కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి రాజు విచ్చేసి ఎజెండా ప్రకారం అంశాలను పూర్తి చేయాలని గతంలో శిక్షణ తీసుకున్న ఉన్నతి కార్యక్రమంపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారన్నారు.
కాబట్టి ఉన్నతి శిక్షణలో నేర్చుకున్న అంశాల ప్రకారం బోధనను జరపాలని, ప్రతి ఉపాధ్యాయులు బేస్ లైన్ పరీక్ష నిర్వహించి, స్థాయిలకు అనుగుణంగా విద్యార్థులను గ్రూపులుగా విభజించాలని, టీచింగ్ డైరీ రాయాలని, బోధనా పీరియడ్లు అభ్యాస పీరియడ్లు ప్రకారం బోధన జరపాలని విద్యార్థులకు అభ్యాసన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థులలో ఆశించిన అభ్యసన సామర్ధ్యాలను పెంపొందించాలని అట్టి విషయాలను ఈ శిక్షణలో చర్చించాలని సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగా కిషన్, తెలంగాణ గణిత ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాడ్వాయి శ్రీనివాస్, కాంప్లెక్స్ సెక్రటరీ వెంకట్ కామారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలల గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.