కామారెడ్డిలో కెసిఆర్‌ నామినేషన్‌

కామారెడ్డి, నవంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం జిల్లాలోని కామారెడ్డి జుక్కల్‌, యెల్లారెడ్డి నియోజక వర్గాలలో మొత్తం 28 మంది అభ్యర్థులు 31 నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు.

కామారెడ్డి నియోజక వర్గంలో 12 మంది అభ్యర్థులు 14 సెట్ల నామినేషన్‌, జుక్కల్‌ నియోజక వర్గంలో 10 మంది అభ్యర్థులు ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్‌ చేశారు. యెల్లారెడ్డి నియోజకవర్గంలో 6 గురు అభ్యర్థులు 7 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని ఆయన తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబందించిన ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర వివరాలను ఎప్పటికప్పుడు ఆయా రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయ నోటీసు బోర్డులపై ఉంచడం తో పాటు ఎన్నికల కమీషన్‌ అధికారిక వెబ్‌ సైట్‌ లో అప్‌ లోడ్‌ చేయడం జరుగుతుందన్నారు.

పూర్తి వివరాలను తెలుసుకోగోరు వారు ప్రత్యేక వెబ్‌ సైట్‌లో చూడవచ్చని తెలిపారు. కామారెడ్డి సెగ్మెంట్‌ లో భారత రాష్ట్ర సమితి నుండి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థి బోడసు నర్సిములు కూడా రెండు సెట్ల నామినేషన్‌ వేశారు. ప్రజాసేన పార్టీ నుండి ఆకుల హనుమండ్లు, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుండి మొహమ్మద్‌ ఆరిఫ్‌, స్వతంత్ర అభ్యర్థులుగా గబ్బుల నాగేందర్‌, సుదర్శన్‌ ఆంద్రపు, పి .రాజేష్‌, మహమ్మద్‌ ఖలీలుల్లా, పప్పు రాజు, బరిగేలా శివ చెవుల పరశురాములు, బుట్టెమ్‌ గారి మాధవరెడ్డి ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్‌ దాఖలు చేశారని కలెక్టర్‌ తెలిపారు.

జుక్కల్‌ సెగ్మెంట్‌ లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నుండి గంగారాం సౌదాగర్‌, తోట లక్ష్మీకాంత రావు లు, నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ నుండి వాగ్మారే గంగాధర్‌, బహుజన్‌ ముక్తి పార్టీ నుండి కందరపల్లి కాశీనాథ్‌, ప్రజాశాంతి పార్టీ నుండి కర్రోళ్ళ మోహన్‌, స్వతంత్ర అభ్యర్థులుగా గంగారాం సౌదాగర్‌, గామ సంజీవ్‌, కాంబ్లే నాందేవ్‌, బక్కవార్‌ సాయిలు, జి.లక్ష్మి లు నామినేషన్‌ దాఖలు చేశారు. యెల్లారెడ్డి బీసెగ్మెంట్‌లో బిజెపి నుండి బాన్సువాడ సుభాష్‌ రెడ్డి రెండు సెట్లు, బి.ఆర్‌.ఎస్‌. సురేందర్‌ జాజల, ప్రజాశాంతి పార్టీ నుండి బాలరాజు తలారి, ధర్మ సమాజ్‌ పార్టీ నుండి శంభుగళ్ల లక్ష్మయ్య, విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి శ్రేనివాస్‌ బాదావత్‌, ఒక్కో సెట్‌ నామినేషన్‌ వేశారని కలెక్టర్‌ పాటిల్‌ తెలిపారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »