బాన్సువాడ, నవంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ ఎక్సైజ్ పరిధిలోని నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ఎక్సైజ్ సీఐ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు మిర్జాపూర్ గ్రామంలో సిబ్బందితో కలిసి దాడి నిర్వహించగా 48వేల రూపాయల మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.
అక్రమంగా మద్యం, నాటు సారాయి, దేశిదారు మద్యం అమ్మినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై తేజస్విని, హెడ్ కానిస్టేబుల్ షరిపోద్దిన్, విట్టల్,శ్రీకాంత్, నాగరాజు, స్నేహలత, తదితరులు పాల్గొన్నారు.