కామారెడ్డిలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఎన్నికల విధులను సమన్వయంతో నిర్వహిస్తూ, ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షణను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని కామారెడ్డి, జుక్కల్‌ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు అర్థుర్‌ వర్చూయియో అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఎల్లారెడ్డి సాధారణ పరిశిలకులు జగదీశ్‌, పొలిసు పరిశిలకులు అబ్దుల్‌ ఖయ్యుమ్‌, వ్యయ పరిశీలకులు పరశివమూర్తి, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భముగా నోడల్‌ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వివిధ విభాగాలకు ఏర్పాటు చేసిన నోడల్‌ అధికారులు పూర్తి అవగాహన కలిగి సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తు.చ తప్పకుండా పాటించేలా, అభ్యర్థుల ఖర్చులను పర్యవేక్షించడం కీలకమని అన్నారు. ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, ఎస్‌.ఎస్‌.టి. బృందాలు, వీడియో వీవింగ్‌ టీమ్‌, అకౌంటింగ్‌ టీమ్‌ భాద్యఈతగా పనిచేయాలని అన్నారు. చెక్‌ పోస్టుల వద్ద ఘట్టి నిఘా ఏర్పాటు చేసి అక్రమ నగదు, మద్యం, కానుకలు వంటి వాటిని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేయాలన్నారు. ఓటర్లు స్వేచ్చాయుత వాతావరణంలో వంద శాతం ఓటు వేసేలా చూడాలన్నారు.

జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడుతూ జిల్లాలో 6,61,163 మంది ఓటరులున్నారని, 791 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళలు, యువత కోసం మాడల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈవీఎం, వివి ఫ్యాట్ల మొదటి ర్యాండమైజేషన్‌ చేశామని, ప్రిసైడిరగ్‌ అధికారులు, సయ్హయ ప్రిసైడిరగ్‌ అధికారులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు.

పోలింగ్‌ బూత్‌ వారీగా రూట్‌ మ్యాప్‌ రూపొందించి, సెక్టోరల్‌ అధికారులను, సూక్ష్మ పరిశీలకులను మునియమించామని అన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి తగు ఏర్పాట్లు చేశామన్నారు. వృద్దులు, దివ్యంగులు, అత్యవసర సేవల విభాగాల్లో ఉన్న వారికి ఫారం-12 ద్వారా పోస్టల్‌ బ్యాలట్‌ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం పరిశీలకులతో కలిసి కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించి నిరంతరం ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చే రాజకీయ ప్రకటనలు, వార్తలను పరిశిలీస్తున్నామని, ట్విట్టర్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌, పేస్‌ బుక్‌లో వచ్చే సందేశాలు, ప్రసారాలను వాచ్‌ చేస్తున్నామని అన్నారు.

సి-విజిల్‌, 1950 టోల్‌ ఫ్రీ నెంబరుతో పాటు వాట్సాప్‌, ఈ మెయిల్‌ ద్వారా ఎన్నికలకు సంబందించిన ఫిర్యాదులను స్వీకరించడంతో పాటు వారు అడిగిన సమాచారాన్ని ఇస్తున్నామని వివరించగా కంట్రోల్‌ రూమ్‌ పనితీరును అభినందించారు.

అనంతరం పొలిసు కార్యాలయ సమీపంలోని కౌటింగ్‌ కేంద్రం, స్ట్రాంగ్‌ రూమ్‌లను అక్కడి ఏర్పాట్లను పరిశీలించి పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. పిమ్మట ఎస్పీ కార్యాలయంలో సభలు, సమావేశాలు, వాహనాల అనుమతులు, సీజర్స్‌తో పాటు శాంతి భద్రతలపై సమీక్షించారు. సమావేశంలో నోడల్‌ అధికారులు కిషన్‌, సింహ రావు, సురేందర్‌ కుమార్‌, సతీష్‌ కుమార్‌, రాజారామ్‌, శాంతి కుమార్‌, రఘునాథ్‌, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »