బాన్సువాడ, నవంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ నియోజకవర్గ ప్రజల హక్కును స్వేచ్ఛను హరిస్తున్న పోచారం కుటుంబ సభ్యుల భారీ నుండి బాన్సువాడ ప్రజలను కాపాడానికే బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని యెండల లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా పోచారం చేస్తున్న ఆగడాలను వారి దోపిడిని అరికట్టాలని నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని పోచారం కుటుంబ సభ్యుల కబంధహస్తాల నుండి బాన్సువాడను కాపాడడానికి నియోజకవర్గ ప్రజల సహకారం కావాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు.
భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలహరిస్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడైన రిషి సునంక్ ఎంతోమంది దేశ విదేశాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారని బాన్సువాడ నియోజకవర్గంలో మాత్రం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు స్థానికేతరులకు అనే పదం అనే ముందు బాన్సువాడలో నియోజకవర్గ అభివృద్ధి పనులకు స్థానిక గుత్తేదారులు గుర్తుకు రాలేదా అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించారు. పట్టణంలో కల్కి చెరువు, సిసి రోడ్డు పనులు, అభివృద్ధి పనులను స్థానికేతరులకు పనులు అప్పజెప్పినప్పుడు గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు.
నియోజకవర్గంలో 11 వేల బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించమని గొప్పలు చెబుతున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్థానికేతరులకు బాన్సువాడలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఏ విధంగా కేటాయించారో బాన్సువాడ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బాన్సువాడను బంగారు మయంగా మార్చానని చెబుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి బంగారం మంచి బంగారమా లేదా కల్తీ బంగారమా అని తెలియజేసేందుకే బాన్సువాడ వచ్చామన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక గ్రామాలలో గ్రామసభలు ఏర్పాటు చేసి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఆయన అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం లో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరిట అవినీతి చేశారని, పేదలు ఇళ్లను కూలగొట్టి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించుకునేందుకు అప్పుల పాలయ్యారన్నారు. నియోజకవర్గంలో సామాన్యుడికి టాక్టర్ ఇసుక దొరకదు గానీ వందల కొద్ది లారీల్లో ఇష్టారాజ్యంగా మంజీరాను ఇసుకను తోడేస్తూ స్పీకర్ పోచారం కుటుంబ సభ్యులు ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఎమ్మెల్యేగా గెలవగానే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు నిజమైన పేదవారిని గుర్తించి ఇవ్వాల్సిన హాక్కుపత్రాలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రీనివాస్ గార్గే, బిజెపి నాయకులు దొరబాబు, చిదుర సాయిలు, అర్సపల్లి సాయి రెడ్డి, పైడిమల్ లక్ష్మీనారాయణ, శంకర్ గౌడ్, ముత్యాల సాయిబాబా, కోణాల గంగారెడ్డి, తుప్తి ప్రసాద్, ఢాకయ్య, రాజాసింగ్, అశ్విన్, అనిల్, విశాల్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.