కామారెడ్డి, నవంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల వ్యయ అంశాలపై తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల వ్యయ పరిశీలకులు తాన్యాసింగ్, ఐఏ Ê ఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలతో ముడిపడిన ఏ విషయమైనా తన దృష్టికి తీసుకురావచ్చని ఆమె ప్రజలకు సూచించారు. సెలవు దినాలలో మినహాయించి మిగతా అన్ని పని దినాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు బోధన్ పట్టణంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో అందుబాటులో ఉంటానని తెలిపారు.
ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు తనకు నేరుగా కలిసి బాన్సువాడ నియోజకవర్గ ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేయవచ్చని, సలహాలు, సూచనలు అందించవచ్చని పరిశీలకులు సూచించారు. నేరుగా కలిసేందుకు వీలుపడని వారు సెల్: 8332021892 కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని ఆమె తెలిపారు.