కామారెడ్డి, నవంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలోని మూడు శాసన సభ నియోజకవర్గాల పరిధిలో దాఖలైన నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ)లో 13 నామినేషన్లు వివిధ కారణాల వాళ్ళ తిర్కరణకు గురయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో 58 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా 6 నామినేషన్లు తిరస్కరింపబడ్డాయని అన్నారు.
ఎల్లారెడ్డి నియోజక వర్గంలో 14 నామినేషన్లు చెల్లుబాటు కాగా రెండు నామినేషన్లు తిరస్కరింపబడ్డాయని, జుక్కల్ నియోజకవర్గంలో 23 నామినేషన్లు చెల్లుబాటు కాగా 5 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని వివరించారు.
కామారెడ్డి సెగ్మెంట్‌లో దుడుగు పాండురంగం, (భారత ఛైతన్య యువజన సంఘం), హోసన్న కుడలి (ఇండియన్ బిలీవర్స్ పార్టీ), చిందం మల్లయ్య (స్వతంత్ర ), కాంబ్లే నాందేవ్ (స్వతంత్ర), సపావత్ సుమన్(స్వతంత్ర), సబిత . ఎస్ (స్వతంత్ర) అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరింపబడ్డాయన్నారు. ఎలారెడ్డి సెగ్మెంట్‌లో స్వతంత్ర అభ్యర్థి జట్రోత్ సురేంద్ర, యుగ తులసి పార్టీ అభ్యర్థి కిచ్చయ గారి దీపక్ రెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలో శోభావతి షిండే, కాంబ్లే నాందేవ్, రాజు, రాజశేఖర్ గైని అభ్యర్థుల దరఖాస్తులు స్క్రూటినిలో తిరస్కరింపబడ్డాయని కలెక్టర్ తెలిపారు.