ఎల్లారెడ్డి, నవంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి మండల కేంద్రంలో హెల్త్ సెంటర్ ఏర్పాటుచేసి అందులో వచ్చిన ఫిర్యాదులకు 24 గంటలలో పరిష్కారం చూపుతానని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ హామీ ఇచ్చారు. మండల కేంద్రాలలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు. అందులో ప్రజా సమస్యలపై ఫిర్యాదు తీసుకుంటారని ఫిర్యాదులు వచ్చిన 24 గంటల్లో పరిష్కారం చూపుతానని మదన్మోహన్ హామీ ఇచ్చారు.
సోమవారం నాగిరెడ్డిపేట మండలంలోని వదల్ పర్తి,చీనూర్,వాడి, గోలి లింగాల, నాగిరెడ్డి పేట, బంజారా, లింగంపల్లి, వెంకంపల్లి, తాండూరు, అక్కంపల్లి గ్రామాల్లో మదన్మోహన్ గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామ సభలలో మాట్లాడారు.
కరోనా ఆపద సమయంలో ప్రాణాలు తెగించి వైద్య సేవలు అందించనన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు మందులు, అంబులెన్స్ సేవలు సొంత డబ్బులతో ఏర్పాటు చేసి ప్రాణానాల కు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడనన్నారు. కరోనా సమయంలో ఎమ్మెల్యే సురేందర్ ఇంట్లో నిద్ర పోయాడని ప్రజల కష్టాలలో పత్తా లేకుండా పోయాడన్నారు.
సురేందర్ ప్రజల కష్టాలు పట్టించుకోలేదని ప్రజల ప్రాణాలు కాపాడిన నాపై దుష్ప్రచారాలు చేస్తున్నాడన్నారు. రోడ్లు మురికి కాలువలు లేక ఎల్లారెడ్డి గ్రామాల పరిస్థితులు అధ్వానం ఉన్నాయన్నారు. ప్రతి గ్రామంలో పోడు పట్టాల సమస్యలు సర్కారును ప్రజాప్రతినిధులను వెక్కిరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు పక్క ఇల్లు నిర్మాణం యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు, నీటి సమస్య రోడ్ల నిర్మాణం తన ముందున్న ప్రథమ కర్తవ్యాలని వాటిని పరిష్కరించి మాట నిలబెట్టుకుంటానని మదన్మోహన్ హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చి ఏమ్మెల్లే జీతంలో ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటా మిగతా జీతం డబ్బులతో పేదలకు ఇళ్ల నిర్మాణం ఖర్చు చేస్తానన్నారు. గెలిచాక అమెరికా వెళ్తానని అపోజిషన్ తప్పుడు ప్రచారం జరుగుతోందని 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తానని ప్రతి మండల కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుచేసి హెల్ప్‌లైన్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు. కాల్ సెంటర్లు ఏర్పాటు ఫిర్యాదులకు 24 గంటలు పరిష్కారం ప్రాధాన్యం ఇస్తానన్నారు. పోలీస్ శాఖ రెవిన్యూ శాఖ భూములు ఇతర సమస్యలపై కాల్ సెంటర్‌లో ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో పరిష్కారం లభించేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. సురేందర్ సొంత మండలం లింగంపేట్‌లో నిర్లక్ష్యం చేశారని ఇతర మండలాల్లో అందుబాటులో ఉండరన్నారు.
ఉద్యోగాలు లేక యువతలో నైరాశ్యం నెలకొందని వారికి ఉపాధి కల్పించడానికి కృషి చేస్తానని మదన్మోహన్ స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ స్కూల్ భవనాలు శిథిలం అయ్యాయని కొత్త భవనాలు నిర్మిస్తానని హమీ ఇచ్చారు. 6 గ్యారంటీ హామీలతో కాంగ్రెస్ పార్టీ 14 రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అంకితభావం కృషి చేస్తుందన్నారు. ఆరు గ్యారెంటీ హామీలపై టిఆర్‌ఎస్ బిజెపిలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రజలు నమ్మడం లేదని మదన్మోహన్ పేర్కొన్నారు.