బాన్సువాడ, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం బాన్సువాడ మండలంలోని కొల్లూరు, నాగారం, బీర్కూరు మండలంలోని దామరంచ, కిష్టాపూర్, చించోలి, అన్నారం బీర్కూర్ గ్రామాలలో బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార సభలలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలు రాగానే ప్రజలు గుర్తుకు వస్తారని ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను విస్మరించడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ యువతతో బారాస ప్రభుత్వం పేపర్ లీకేజీ వల్ల నిరుద్యోగ యువత భవిష్యత్తు అందాకారంగా తయారైందని, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా కేవలం తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారని ప్రజలు కాంగ్రెస్,బిఆర్‌ఎస్ పార్టీలు ప్రభుత్వాలను చూశారని ఒకసారి రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని అవకాశం ఇవ్వాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని నిధుల ద్వారా గ్రామాలలో నూతన గ్రామపంచాయతీ భవనాలు, వైకుంఠధామం, హరితహారం, సీసీ రోడ్డు, ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయన్నారు. రైతులు పండిరచిన పంటలకు ఎమ్మెస్పీ ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలను తన పథకాలుగా చెప్పుకుంటూ రాజకీయంగా ఎదుగుతున్నారని ప్రజలు గమనించాలన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం పేరిట కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నిజమైన లబ్ధిదారులకు కాకుండా కేవలం తన అనుచరులకు కార్యకర్తలకు డబ్బులు కట్టబెట్టిన ఘనత పోచారం శ్రీనివాస్ రెడ్డికి దక్కుతుందన్నారు. పేదలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఇప్పటివరకు ఇండ్ల పట్టాలు ఎందుకు అందివ్వలేదని ఆయన ప్రశ్నించారు, తాను బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలవగానే మొదట అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అందజేస్తానని, అలాగే నియోజకవర్గంలో 20వేల డబల్ బెడ్ రూమ్ ఇండ్లను గ్రామసభలు ఏర్పాటు చేసి నిజమైన పేదవారికి ఇండ్లను ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ప్రజలు కాంగ్రెస్ పార్టీ టిఆర్‌ఎస్ పార్టీ పాలన చూశారని ఒకసారి బిజెపి పార్టీకి అవకాశం ఇచ్చి చూడాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దొరబాబు, చిదుర సాయిలు, పైడిమల్ లక్ష్మీనారాయణ, మాధవ్ యాదవ్, శంకర్ గౌడ్, హాన్మండ్లు యాదవ్, గుడుగుట్ల శ్రీనివాస్, ముత్యాల సాయిబాబా, స్వామి యాదవ్, కోణాల గంగారెడ్డి, రాజాసింగ్ సాయి కిరణ్, చీకట్ల రాజు, భూమరెడ్డి, సాయి రెడ్డి, విశాల్, అశ్విన్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.