ఎన్నికల సంబంధిత అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చు

నిజామాబాద్‌, నవంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

బోధన్‌, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అంశమైనా తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల సాధారణ పరిశీలకులు లలిత్‌ నారాయణ్‌ సింగ్‌ సందు సూచించారు. పై రెండు సెగ్మెంట్లలో ఎన్నికలతో ముడిపడిన ఏ విషయమైనా తన దృష్టికి తీసుకురావచ్చని ప్రజలకు సూచించారు.

సెలవు దినాలలో మినహాయించి మిగతా అన్ని దినాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు తాను బోధన్‌ పట్టణంలోని ఇరిగేషన్‌ అతిథి గృహంలో అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుండి 10.30 గంటల వరకు తనకు నేరుగా కలిసి బోధన్‌, బాన్సువాడ నియోజకవర్గాల ఎన్నికల సంబంధిత అంశాలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేయవచ్చని, సలహాలు, సూచనలు అందించవచ్చని పరిశీలకులు సూచించారు.

నేరుగా కలిసేందుకు వీలుపడని వారు సెల్‌: 8332021758 కు ఫోన్‌ చేసి ఫిర్యాదులు చేయవచ్చని జనరల్‌ అబ్జర్వర్‌ లలిత్‌ నారాయణ్‌ సింగ్‌ సందు తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »