కామారెడ్డి, నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో లత మహిళకు అత్యవసరంగా ఏబీ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కావలసిన రక్తం సిద్దిపేట జిల్లాలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ జిల్లా,రెడ్ సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ సంతోష్‌కి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి 12 వ సారి కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ఏబీ నెగిటివ్ రక్తం దొరకడం చాలా ఇబ్బందితో కూడుకున్న పని అని 10 వేల మందిలో 2 వేల మందిలో మాత్రమే ఏబి నెగిటివ్ రక్తము ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత సంతోష్‌కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు.
గతంలో కూడా చాలా సందర్భాల్లో గర్భిణీ స్త్రీల కోసం, ఆపరేషన్ల కోసం అనీమియా వ్యాధితో బాధపడుతున్న వారికోసం సకాలంలో రక్తాన్ని సంతోష్ అందజేశారన్నారు. కార్యక్రమంలో కేబిఎస్ రక్తనిధి ప్రతినిధులు జీవన్, వెంకటేష్, సంపత్ పాల్గొన్నారు.