అబ్జర్వర్ల సమక్షంలో రెండవ ర్యాండమైజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌, నవంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా గురువారం పోలింగ్‌ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజెషన్‌ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్‌.ఐ.సి హాల్‌ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజెషన్‌ ప్రక్రియ నిర్వహించారు.

సాధారణ పరిశీలకులు ఎం.సుబ్రాచక్రవర్తి, ఐ.ఏ.ఎస్‌, లలిత్‌ నారాయణ్‌ సింగ్‌ సందు, ఐ.ఏ.ఎస్‌, గౌతమ్‌ సింగ్‌, ఐ.ఏ.ఎస్‌లు ర్యాండమైజెషన్‌ ను నిశితంగా పరిశీలించారు. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడిరగ్‌, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారులను, ఓ.పీ.ఓలను ర్యాండమైజెషన్‌ ద్వారా కేటాయించారు.

వీరికి ఇప్పటికే పలు విడతలుగా ఎంపిక చేసిన వివిధ కేంద్రాలలో మాస్టర్‌ ట్రైనర్స్‌ చే పోలింగ్‌ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించడం కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పరిశీలకుల దృష్టికి తెచ్చారు. జిల్లాలోని ఆరు సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 1549 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, మొత్తం 7131 మందిని పోలింగ్‌ విధుల కోసం నియమించడం జరిగిందన్నారు. 20 శాతం రిజర్వు సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారని అన్నారు.

పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించబడిన ప్రతి బృందంలో ఒక ప్రిసైడిరగ్‌ అధికారి, ఒక సహాయ ప్రిసైడిరగ్‌ అధికారి, ఇద్దరు ఇతర పోలింగ్‌ సిబ్బంది ఉంటారని అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గం పరిధిలో పోలింగ్‌ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఐదు పోలింగ్‌ కేంద్రాల చొప్పున మహిళా బృందాలను, ఒక దివ్యాంగుల బృందం, ఒక యువతతో కూడిన పోలింగ్‌ బృందాలను ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజెషన్‌ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, సీపీఓ బాబూరావు, ఎన్‌ఐసి అధికారి రవికుమార్‌, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

బ్యాలెట్‌ యూనిట్ల సప్లిమెంటరీ ర్యాండమైజెషన్‌

నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్‌ యూనిట్ల సప్లిమెంటరీ ర్యాండమైజెషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు.

అర్బన్‌ సెగ్మెంట్‌ నుండి 21 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో అదనపు బ్యాలెట్‌ యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిరది. ఈ మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల ఎదుట ఎన్నికల సంఘం నిబంధలను అనుసరిస్తూ పారదర్శకంగా బ్యాలెట్‌ యూనిట్ల సప్లిమెంటరీ ర్యాండమైజెషన్‌ ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియలో అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, అర్బన్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఎం.మకరందు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »