ఈ నెల 21, 22 తేదీలలో రెండవ విడత శిక్షణ

కామారెడ్డి, నవంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

పోలింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించడంలో పోలింగ్‌ బృందాల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం మాస్టర్‌ ట్రైనీలతో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీలలో ప్రిసైడిరగ్‌, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారులకు ఆయా నియోజక వర్గ స్థాయిలో ఈ.వి.ఏం. లు, విప్‌.ఫ్యాట్‌ల నిర్వహణ, మాక్‌ పోలింగ్‌, చెక్‌ లిస్ట్‌ ప్రకారం పోలింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించుటకు అనుసరించవలసిన విధానాలపై రెండవ విడత శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నామని, వారికి స్పష్టమైన అవగాహన కలిగించాలని కలెక్టర్‌ తెలిపారు.

ఓటరుకు మార్గనిర్దేశం చేయుటకు పోలింగ్‌ బూత్‌ సమీపంలో ఓటర్‌ అసిస్టెన్స్‌ బూత్‌లు ఏర్పాటు చేయాలని, పోలింగ్‌ బూత్‌ ఎదుట ఓటరు సమాచార నిమిత్తం బూత్‌ వివరాలు, ఎలా ఓటు వేయాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, అభ్యర్థుల జాబితా ఉన్న నాలుగు రకాల గోడ పత్రికలు ప్రదర్శించాలన్నారు. పోలింగ్‌ రోజుకి ఉదయం 5.30 గంటలకు పోలింగ్‌ ఏజెంట్ల సమక్షములో మాక్‌ పోలింగ్‌ నిర్వహించి, డేటా క్లియర్‌ చేయాలని అన్నారు.

రహస్య ఓటింగ్‌ పాటించేలా కంపార్ట్మెంట్‌ ఏర్పాటు చేయాలని, మిషన్లలో సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే సెక్టోరల్‌ అధికారికి తెలపాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో నలుగురు సిబ్బంది కేటాయిస్తున్నామని, అందులో ఒకరు తప్పనిసరిగా మహిళా ఉంటారన్నారు. ఒక ప్రిసైడిరగ్‌ అధికారి, ఒక సహాయ ప్రెసిడిరగ్‌ అధికారి, ఇద్దరు పోలింగ్‌ సిబ్బంది ఉంటారన్నారు. పి .ఓ.లు డైరీని జాగ్రత్త రాయాలని, పోలింగ్‌కు ముందు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలాని పోలింగ్‌ అనంతరం నిర్దేశించిన ప్యాకెట్‌ వారీగా నిర్ణీత నమూనాలో ఫారాలు నింపి సీలు చేసి రిసిప్షన్‌ కౌంటర్‌లో అందించేలా చూడాలన్నారు.

పిఓ .లు, ఎపిఓ లకు శిక్షణలో ప్రాక్టికల్‌ గా పోలింగ్‌ ఏ విధంగా నిర్వహించాలో చొయించాలని మాస్టర్‌ ట్రైనీలకు సూచించారు. అదేవిధంగా పురుష, మహిళా ఓటర్ల జాబితాను ఎలా మార్క్‌ చేయాలో వివరించాలన్నారు. ఈ నెల 23,24 తేదీలలో అభ్యర్థులు, గుర్తులను బ్యాలట్‌ యూనిట్లలో కమీషనింగ్‌ చేస్తామన్నారు.

అనంతరం కలెక్టర్‌ కంట్రోల్‌ రూమ్‌ ను సందర్శించి సి-విజిల్‌ యాప్‌, 1950 ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీసి ఎపిక్‌ కార్డులు, ఓటరు జాబితా, ఉలంఘనాలకు సంబందించిస్‌ వస్తున్న వివిధ రకాల ఫిర్యాదులపై అంశం వారీగా విడిగా నమోదు చేయాలని సూచించారు. సి-విజిల్‌ యాప్‌ ద్వారా ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సరివేలెన్సు బృందాలు నియోజక వర్గాలలో తిరుగుతూ తనిఖీ చేస్తున్న దృశ్యాలను వీక్షించారు. కార్యక్రమంలో నోడల్‌ అధికారి రఘునందన్‌, సతీష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »