కామారెడ్డి, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా నుండి వచ్చే బాయిల్డ్, రా రైస్ సి.ఏం.ఆర్.ను రాష్ట్ర ఆహార సంస్థ గిడ్డంగులకు తరలించుటకు అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు అధికంగా హమాలీలలు ఏర్పాటు చేసి ఆన్‌లోడ్ చేసుకోవలసిందిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ఎఫ్.సి.ఐ. అధికారులను కోరారు.
గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఎఫ్.సి.ఐ. అధికారులు, రాష్ర ఆహార సంస్థ గిడ్డంగుల మేనేజర్లు, రైస్ మిల్లులల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లా నుండి రైస్ మిల్లర్లు ధాన్యం తరలించుటకు ఎక్కువ బీఏ.సి.కే. లకు అవకాశం కల్పించడంతో పాటు గోదాములలో స్థలాన్ని అందుబాటులో ఉంచాలని, మిల్లర్ల నుండి వచ్చే ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకొనుటకు ఆమోదించాలని కోరారు.
రైస్ మిల్లర్లు కూడా తమకు నిర్థారించిన సి.ఏం.ఆర్. రైస్‌ను భారత ఆహార సంస్థకు సకాలంలో తరలించాలని సూచించారు. సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ అభిషేక్ సింగ్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.