డిచ్‌పల్లి, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయంలో అంతర్ కళాశాలల మహిళల కబడ్డీ సెలక్షన్స్ – 2023 పోటీలు తెలంగాణ విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో రిజిస్ట్రార్ ఆచార్య ఏం.యాదగిరి ప్రారంభించినారు.
అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య.యం. యాదగిరి మాట్లాడుతూ క్రీడలు దేశ ఔన్నత్యాన్ని సూచిస్తాయని, క్రీడాకారులు గెలుపు, ఓటమిలను, సమానంగా స్వీకరించాలని పేర్కొన్నారు. పోటీలు మానసిక ఒత్తిడిని ఉపసంహరించి, మనస్సును దృఢంగా ఉంచుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ హారతి అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు, క్రీడా స్ఫూర్తితో క్రమశిక్షణ కలిగి ఉత్తమ క్రిడాకారులుగా ఎదగాలని యూనివర్సిటీకి రాష్ట్రానికి మరియు దేశానికి, మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చి పెట్టాలని పేర్కొన్నారు.
సెలక్షన్ అయిన కబడ్డీ విద్యార్థులకు తెలంగాణ యూనివర్సిటీ తరఫున సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌లో మంచి ప్రతిభని కనబరిచాలని సూచించారు.
సెలక్షన్ అయిన వర్సిటీ మహిళా జట్టు ఈనెల 22 నుండి 26 తేదీలలో తమిళనాడు రాష్ట్రంలోని, అలగప్ప యూనివర్సిటీ కరైకుడిలో పాల్గొంటుందని తెలిపారు. ఈ సెలక్షన్‌లో వర్సిటీ క్రీడా విభాగాం డైరెక్టర్ డాక్టర్ జి బాలకిషన్ వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్స్ మరియు వర్సిటీ క్రీడా విభాగ సహాయఆచార్యులు (కాంటాక్ట్) డాక్టర్ బి.ఆర్ నేత జూనియర్ అసిస్టెంట్ నరేష్ జాదవ్, వాలంటీర్స్ అశ్విన్, ఆకాష్, రవీందర్ తదితర క్రీడాకారులు పాల్గొన్నారు.