నిజామాబాద్, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జి. వైజయంతి ఆదేశాల మేరకు శనివారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి. లక్ష్మి నర్సయ్య, నిజామాబాద్ / కామారెడ్డి జిల్లాలోని కోర్టులో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమీక్ష నిర్వహించారు.
ఇట్టి సమావేశములో బాలల లైంగిక వేధింపుల చట్టం, మరియు మాదక ద్రవ్యాల నిరోదక చట్టం, వైట్ కాలర్ చట్టాల గురించి కేసులలో తీసుకొనవలసిన జాగ్రత్తల గురించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిప్యూటి డైరెక్టర్ లక్ష్మీనర్సయ్య మరియు ఆర్థిక నేరాల, వైట్ కాలర్ చట్టం గురించి బోధన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ సమ్మయ్య వివరంగా తెలిపారు.
ప్రతి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన విధులను శ్రద్ధతో నిర్వహించి, నేరస్తులకు శిక్షపడేటట్లు కృషి చేయాలని కోరారు. సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బంటు వసంత్, నంద రమేష్, జి. శ్యామ్రావు, కావేటి శేషు, అందె శ్రీనివాస్, నిమ్మ దామోధర్ రెడ్డి, డాక్టర్ పి. సామయ్య, మహ్మద్ రహిముద్దిన్, డి. వీరయ్య, భూసారపు రాజేష్ గౌడ్, అశోక్ శివరాం నాయక్, చిదిరాల రాణి, పొరిక రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.