బాన్సువాడ, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని పాత అంగడి బజార్ చౌరస్తాలో మంగళవారం వాహనాలను తనిఖీ చేయుచుండగా కన్నయ్యలాల్ తండా గ్రామానికి చెందిన కాల్యనాయక్ అనే వ్యక్తి వద్ద ఐదు లక్షల రూపాయలు ఎలాంటి సంబంధిత పత్రాలు లేకుండా తీసుకువెళ్తుండగా పట్టుకొని ఆర్వో అధికారి కార్యాలయంలో జమ చేసినట్లు పట్టణ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. తనిఖీలో ఎస్సై చంద్రయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.