కామారెడ్డి, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు హోమ్ ఓటింగ్ బృందాలను ర్యాండమైజేషన్ ద్వారా జిల్లాలోని మూడు నియోజక వర్గాలకు కేటాయించామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఎన్నికల సాధారణ పరిశీలకులు ఛిఫంగ్ అర్థుర్ వర్చూయో, జగదీశ్ సమక్షంలో ర్యాండమైజేషన్ పారదర్శకంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాల్లో 533 మంది 80 సంవత్సరాలు పైబడ్డ వృద్దులు, దివ్యంగులు ఫారం-12 ద్వారా పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ర్యాండమైజేషన్ ద్వారా జుక్కల్ కు 5, యెల్లారెడ్డి కి 4, కామారెడ్డి నియోజక వర్గానికి 3 బృందాల చొప్పున 12 బృందాలను కేటాయించామని కలెక్టర్ తెలిపారు.
ఒక్కో బృందంలో ఒక సూక్ష్మ పరిశీలకులు, ఒక ప్రిసైడిరగ్ అధికారి, ఒక పోలింగ్ సిబ్బంది, ఇద్దరు పోలీసులతో పాటు ఒక విడియోగ్రాఫర్ ఓటింగ్ ప్రక్రియను చిత్రీకరిస్తారని అన్నారు. ఈ బృందాలు మంగళ, బుధవారాలలో తమకు కేటాయించిన నియోజక వర్గాలలో హోమ్ ఓటింగ్ ప్రక్రియపూర్తి చేస్తారని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో నోడల్ అధికారులు రాజారామ్, రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.