సంగం గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఇంటింటి ప్రచారం..

నసురుల్లాబాద్‌, నవంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నస్రులాబాద్‌ మండలంలోని సంగం గ్రామంలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌ రెడ్డి (నందు) మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్‌ రెడ్డికి ప్రజలు ఓటు వేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తామన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని అన్నారు. ఈనెల 30వ తేదీన జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్‌ రెడ్డిని చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, తూము సాయగౌడ్‌, యూసుఫ్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »