బాన్సువాడ, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని గాంధీచౌక్ ఎన్జీవోస్ కాలనీ, జెండాగల్లీ పలు కాలనీలలో, బిజెపి నాయకులు కార్యకర్తలు మంగళవారం బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ బాన్సువాడలో అధికార పార్టీ నాయకుల అరాచకాలు అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే నీతి నిజాయితీపరుడైన బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మి నారాయణ ఓటు వేసి గెలిపించాలన్నారు.
అసలైన నిరుపేదలకు డబుల్ ఇండ్లను కట్టబెట్టామని గొప్పలు చెబుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కేవలం తన అనుచరులకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టబెట్టారని వారు ఆరోపించారు. గ్రామాలలో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయని,. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం కాపీ కొడుతుందని, కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పాటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
రాష్ట్రాన్ని బంగారు కుటుంబం గా మారుస్తునని చెప్పి తన కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు కుటుంబంగా మార్చుకున్నారన్నారు. బాన్సువాడ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతి అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి ఓటు అనే వజ్రాయుధం ద్వారా తమ సమస్యలను తామే పరిష్కరించుకోవచ్చని కావున బిఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చారని ఈసారి బిజెపికి అవకాశం ఇచ్చి ప్రజాస్వామ్య పాలనకు తమ వంతు సహకారం అందించాలన్నారు.
బాన్సువాడ లో మార్పు జరగాలంటే ఒకసారి బిజెపి పార్టీకి అవకాశం ఇచ్చి చూడాలని వారు ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో అర్సపల్లి సాయి రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుడుగుట్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు చిధుర సాయిలు,డాకయ్య, లింగాల రవీందర్ రెడ్డి,, పట్టణ కార్యదర్శి కోణాల గంగారెడ్డి, రాజాసింగ్, కొండని గంగారం, రీతు సింగ్, గోపాల్,చీకట్ల రాజు, తుప్తీ ప్రసాద్, భాస్కర్ రెడ్డి, శివశంకర్, అశ్విన్, విశాల్, శ్యామ్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.