కామారెడ్డి, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలానికి చెందిన రాజు (42) లివర్ వ్యాధితో ప్రభుత్వ వైద్యశాలలో నిజామాబాదులో ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో వారికి కావలసిన బి నెగిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు వివిధ పత్రికల్లో కామారెడ్డి రక్తదాతల సమూహం అందజేస్తున్న రక్తదాన కార్యక్రమాలను గురించి తెలుసుకొని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
కాగా వారికి కావలసిన రక్తాన్ని పాల్వంచ గ్రామానికి చెందిన నవీన్ సహకారంతో కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నెగిటివ్ గ్రూపుల కొరత ఉండడం జరుగుతుందని ప్రతి ఒక్క వ్యక్తి వారికి సంబంధించిన రక్త గ్రూపును తెలుసుకోవాలని, మానవతా దృక్పథంతో రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు.
ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతగా నిలుస్తున్న రక్తదాత నవీన్ కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ మరియు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ అధ్యక్షులు పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, టెక్నీషియన్లు జీవన్, సంపత్, వెంకటేష్ పాల్గొన్నారు.