బాన్సువాడ, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణ శివారులోని కోయ్యాగుట్ట చౌరస్తాలో వాహనాల తనిఖీ చేస్తుండగా గురువారం టాటా ఇండికా వాహనంలో తరలిస్తున్న పదివేల ఐదువందల విలువైన మద్యం సీసాలను, కారును జప్తు చేసినట్లు ఎక్సైజ్ సీఐ యాదగిరి రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అక్రమంగా మద్యం, మాదక ద్రవ్యాలు తరలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమంగా మద్యం నిల్వ ఉంచినట్లయితే ఎక్సైజ్ శాఖకు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు రహస్యంగా ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై తేజస్విని, ఎక్సైజ్ సిబ్బంది షరీపుద్దీన్, విట్టల్, సందీప్, నాగరాజు స్వరూప, స్నేహలత, ఎక్సెస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.