కామారెడ్డి, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో ఎల్లారెడ్డి గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని కాంగెస్ర్ అభ్యర్థి మదన్ మోహన్ అన్నారు. రాజంపేట మండలంలోని సిద్దాపూర్, ఎల్లాపూర్ తండా, నడిమి తండా, గుండారం, ఎల్లారెడ్డిపల్లి, కొండాపూర్, అరగుండా, అన్నారం, బసవన్నపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సందర్భంగా ఆయా గ్రామాల మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్కు బోనాలు బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మదన్మోహన్ మాట్లాడుతూ.. ప్రజల అభిమానం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడిరచేందుకు బీఆర్ఎస్ బిజెపి ఒకటయ్యాయని ఆయన ఆరోపించారు. ఎప్పటికీ ప్రజలు తన పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాల ముందు వారి కుట్రలు నిలువని మదన్మోహన్ తెలిపారు.