కామారెడ్డి, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎన్నికల విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ పి.ఎస్ సూక్ష్మ పరిశీలకులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో సాధారణ పరిశీలకులు అర్థుర్ వర్చూయియో, జగదీశ్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలోని ప్రతి అంశంపై సూక్ష్మ పరిశీలకులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పోలింగ్ కు ముందు, తర్వాత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. మాక్ పోల్ నిర్వహణ సమయంలో ఏజెంట్ లు ఎంతమంది వచ్చారో సరిచుకోవాలని, తప్పనిసరిగా 50 ఓట్లు తో మాక్ పోల్ నిర్వహించాలని సూచించారు. ఏజెంట్ ల సలహాలు, సూచనలు నోట్ చేసుకొని సాధారణ పరిశీలకులకు తెలియజేయాలన్నారు.
మాక్ పోల్ అనంతరం ఓట్లను క్లియర్ చేసేందుకు క్లీయర్ బటన్ నొక్కాలని, అనంతరం ఈవియం లను సీజ్ చేసి రెసెప్షన్ కేంద్రంలో అందజేయాలని అన్నారు. అంతకుముందు మాస్టర్ ట్రైనర్లు సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ అందించి వారి సందేహాలను నివృత్తి చేశారు. శిక్షణ కార్యక్రమంలో సిపిఓ రాజారాం, నోడల్ అధికారి రఘునందన్, అధికారులు పాల్గొన్నారు.