కామారెడ్డి, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 25వ తేదీన ప్రధానమంత్రి నరేంధ్ర మోడి భాహిరంగ సభ కామారెడ్డి పట్టణంలోని స్టానిక డిగ్రీ కళాశాల మైదానం లో ఉన్నందున టేక్రియాల్ ఎక్స్ రోడ్ నుండి కామారెడ్డి కొత్త బస్టాండ్, అశోక నగర్ ఎక్స్ రోడ్ వైపు వెళ్ళే వాహనాలకు ఉదయం 12 గంటల నుండి సాయంత్రం 4 ల వరకు అనుమతి లేదని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
కామారెడ్డి పట్టణంలోకి వెళ్ళే వాహన దారులు బైపాస్ ద్వారా రామారెడ్డి బ్రిడ్జ్, సిరిసిల్ల బ్రిడ్జ్ నుండి పాత బస్టాండ్, నిజాంసాగర్ ఎక్స్ రోడ్ మరియు ఇతర మార్గాల ద్వారా కొత్త బస్టాండ్, అధే విధంగా హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్ళే వాహనములు నర్సన్నపల్లి నుండి బస్టాండ్‌కు వచ్చి తిరిగి నర్సన్నపల్లి ద్వారా నిజామాబాద్‌కు వెళ్ళాలని సూచించారు.
బహిరంగ సభకు వాహనాలలో వచ్చే ప్రజలు వారి యొక్క వాహనాలను స్టానిక చర్చ్ గ్రౌండ్, గంజ్ మార్కెట్, వీక్లీ మార్కెట్లలో నిలుపుకొని అక్కడి నుండి కాలినడకన సభ ప్రాంగణంలోనికి రావలసిందిగా మనవి చేశారు. కావున ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసు వారికి సహకరించాలని పేర్కొన్నారు.