ఆరోజు వేతనంతో కూడిన సెలవు

కామారెడ్డి, నవంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రాష్ట్ర శాసన సభకు ఈ నెల 30 న జరగనున్న పోలింగ్‌ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనుటకు రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 30 న గురువారం అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు, పరిశ్రమలకు వేతనంతో కూడిన కార్మిక సెలవు దినంగా ప్రకటించారని కలెక్టర్‌ తెలిపారు. కాగా పోలింగ్‌ కేంద్రాలుగా, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలుగా ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఉపయోగిస్తున్న విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ఈ నెల 29 న సెలవు దినంగా ప్రకటించామని అన్నారు. అయితే 29, 30 తేదీలలో ట్రెజరీ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తాయని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »