కామారెడ్డి, నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అత్యవసరంగా బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం నిజామాబాద్ లో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో వెంటనే స్పందించి చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన బి నెగిటివ్ రక్తదాత ఉమేష్ సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007 నుండి ఇప్పటివరకు 18 వేలకు పైగా యూనిట్ల రక్తాన్ని,200 లకు పైగా రక్తదాన శిబిరాలను, కరోనా సమయంలో 100 యూనిట్ల ప్లాస్మాను, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 1650 యూనిట్ల రక్తాన్ని అందజేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం జరుగుతుందని, ఇంత పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాల నిర్వహించడము రక్తదాతల సహకారంతో మాత్రమే జరిగిందని రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత ఉమేష్ కు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్, ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు,జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు.