బాన్సువాడ, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలని తాను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నిలబడితే ప్రజల నుంచి తనకు వస్తున్న ఆదరణ చూడలేని బిఆర్‌ఎస్ నాయకులు ప్రత్యర్థి పార్టీ నాయకులపై దాడులు చేయడం అప్రజాస్వామికమని బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ అన్నారు. అర్ధరాత్రి తన నివాసం పై జరిగిన దాడికి నిరసనగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్లగుడ్డ కట్టుకొని మౌనవ్రతం పాటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్ధరాత్రి బిఆర్‌ఎస్ నాయకులు గుండాలు అర్ధరాత్రి కారులో వచ్చి ఇంటి గేట్ తెరిచి ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారన్నారు. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలవాలని భయభ్రాంతులకు గురిచేసి గెలవాలనుకోవడం పిరికిపంద చర్య అన్నారు. తన నివాసానికి వచ్చిన డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆయన అనుచరులు క్రింద గదిలో ఉన్న డ్రైవర్ దత్తును, మరొక వ్యక్తిని దాడి చేయడమే కాకుండా మీ బాయ్ సాబును చంపుతామని బెదిరించారన్నారు.
సంబంధిత అధికారులు కేసును విచారణ జరిపి తన ఇంటికి వచ్చి దాడి జరిపిన వారిపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తనకు మద్దతు తెలిపిన బిజెపి శ్రేణులకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.