ఎగ్జిట్‌ పోల్స్‌ ను ఎలా లెక్కిస్తారు? అంచనాలు ఎంత వరకు నిజం?

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో చివరగా తెలంగాణలో నేడు పోలింగ్‌ కొనసాగుతోంది.

మిగతా నాలుగు రాష్ట్రాలు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌, రాజస్థాన్‌, మిజోరంలలో పోలింగ్‌ ఇప్పటికే ముగిసింది.

దీంతో తెలంగాణలో పోలింగ్‌ ముగిసిన తర్వాత.. అంటే సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగుస్తుండగా 5:30 గంటలకు ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. పోలింగ్‌ లో ఓటరు ఎవరివైపు మొగ్గు చూపారనే విషయాన్ని చాలా వరకు ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తాయి.

పోలింగ్‌ రోజే ఓటరు మనోగతం తెలుసుకుంటూ సర్వే నిర్వహించడమే ఎగ్జిట్‌ పోల్స్‌.. కొన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లతో మాట్లాడి, పోలింగ్‌ సరళిపై ఒక అంచనాకు వస్తారు. ఇలా సేకరించిన సమాచారంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది లెక్కకడతారు. ప్రీ పోల్‌ సర్వేకు ఎగ్జిట్‌ పోల్స్‌ కు ప్రధానమైన తేడా.. ప్రీపోల్‌ సర్వేలో వివిధ వర్గాల వారీగా ఓటర్లను ప్రశ్నించి సమాచారం సేకరిస్తారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ విషయానికి వస్తే.. పోలింగ్‌ రోజే ఓటేసేందుకు వచ్చే వారిని ప్రశ్నించి వివరాలు సేకరిస్తారు. దీనివల్ల ఎగ్జిట్‌ పోల్స్‌ లో కచ్చితత్వం పాళ్లు ఎక్కువ. ఈ అంచనాలు దాదాపుగా రిజల్ట్‌ కు దగ్గరగా ఉంటాయి. అయితే, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎక్కువ మందిని ప్రశ్నించి పకడ్బందీగా నిర్వహిస్తేనే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »