కామారెడ్డి, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలుచేయడంలో పౌరుల భాగస్వామ్యం కూడా కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు పరా శివమూర్తి , ఎస్పీ సింధు శర్మ తో కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన సి-విజిల్, 1950, ఏం.సి.ఏం.సి. ల పనితీరును పరిశీలించి సంబంధిత నోడల్ అధికారులతో వాటిని …
Read More »Monthly Archives: November 2023
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వానాకాలం 2023 – 24 సీజన్ కు సంబంధించి వరి ధాన్యం సేకరణ కోసం జిల్లాలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. వరి ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు వీలుగా జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో …
Read More »నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, సీ.పీ
నిజామాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం వెలువడిన నేపధ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నగరపాలక సంస్థ నూతన భవనంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని, నగర పాలక సంస్థ పాత భవనంలో నిజామాబాద్ …
Read More »సి విజల్ పనితీరు భేష్…
కామారెడ్డి, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలలో అభ్యర్థులు చేసే ఖర్చును అకౌటింగ్ టీమ్ పక్కాగా నిర్వహించాలని వ్యయ పరిశీలకులు పరా శివమూర్తి సూచించారు. జిల్లాకు వ్యయ పరిశీలకులుగా వచ్చిన పరా శివమూర్తి శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నోడల్ అధికారులు, సహాయ వ్యయ పరిశీలకులు, ఎఫ్‌ఎస్‌టి, బిఎస్‌టి, ఎస్‌ఎస్‌టి తదితర బృందాలు, ఎన్నికల విభాగం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి …
Read More »నామినేషన్ల పర్వం… 4 నామినేషన్లు దాఖలు
కామారెడ్డి, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నామినేషన్ల పర్వం మొదలైన శుక్రవారం కామారెడ్డి నియోజక వర్గంలో 4 నామినేషన్లు దాఖలు కాగా, జుక్కల్, యెల్లారెడ్డి నియోజక వర్గాల నుండి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా వెంకన్న గుగులోతు, ఆరోళ్ల నరేష్, చిట్టిబొయిన సులోచన రాణి నామినేషన్లు దాఖలు …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, నవంబరు 3, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి రాత్రి 12.09 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఆర్ద్ర ఉదయం 8.01 వరకుయోగం : సిద్ధం మధ్యాహ్నం 3.41 వరకుకరణం : గరజి ఉదయం 11.42 వరకు తదుపరి వణిజ రాత్రి 12.09 వరకు వర్జ్యం : రాత్రి 8.51 – 10.33దుర్ముహూర్తము : ఉదయం …
Read More »సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :సి -విజిల్ యాప్ ద్వారా ప్రతి ఒక్క పౌరుడు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చని వారి పేర్లు, ఫోన్ నెంబర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పౌరులు తమ చుట్టుప్రక్కల జరుగుచున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబందించిన ఫోటోలు లేదా …
Read More »మూలకాల పెట్టె పుస్తకావిష్కరణ
వేల్పూర్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు ఫిజికల్ సైన్స్ ఫోరమ్ అధ్వర్యంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంక్సాపూర్, మండలం వేల్పూరులో జరిగిన కార్యక్రమంలో తంగుడిగే శ్రీనివాస్ రావు రచించిన మూలకాల పెట్టె అను పుస్తకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత శ్రీనివాస్ రావు మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రమును తెలుగు భాషకు అనుసంధానం చేస్తూ ఆటవెలది పద్యరూపంలో విద్యార్థులకు విన్నూత రీతిలో విజ్ఞాన …
Read More »బాన్సువాడ భాజపా అభ్యర్థిగా ఎండల
బాన్సువాడ, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ అధిష్టానం గురువారం అభ్యర్థుల మూడవ జాబితా ప్రకటించింది. ఇందులో 35 మందికి చోటు కల్పించారు. అందరి దృష్టి ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడపై ఉంది. బాన్సువాడలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి బలమైన నాయకుడిగా ముద్ర పడ్డారు. ఈ బలమైన నాయకుడిని ఢీ కొనడానికి ఎవరు వస్తారని? భాజపా, కాంగ్రెస్ పార్టీలో …
Read More »నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నామినేషన్ల దాఖలుకు సంబంధించి గురువారం పత్రికా ప్రకటన ద్వారా పలు సూచనలు చేశారు. ఈ నెల 3 నుండి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 13న నామినేషన్ల పరిశీలన, 15న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అదే …
Read More »